తెలంగాణకు మళ్ళీ మిడతల దండు ప్రభావం పొంచి ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు సిఎం కేసీఆర్ కి సమాచారం ఇచ్చారు. దీనితో కేసీఆర్ వెంటనే అప్రమత్తమయ్యారు. తెలంగాణాలో మిడతల దండు అడుగు పెడితే ఎం చెయ్యాలి అనే దాని మీద ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రగతి భవన్ లో.
ఈ సందర్భంగా అధికారులు అవి ఏ జిల్లాలకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద కేసీఆర్ కి సమాచారం ఇచ్చారు. ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ కి వివరించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయంటే…
200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామంలో ఉన్నాయి. అవి వచ్చే అవకాశం ఉన్న జిల్లాలు చూస్తే భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, భాన్సువాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ నుంచి మిడతలు వచ్చే అవకాశం ఉంది. 8 జిల్లాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలి అంటూ కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.