ప్రపంచమంతా కరోనాపై యుద్ధం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం రాజకీయ యుద్ధం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయమంతా కింజరాపు కుటుంబం చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈఎస్ఐ స్కామ్ విషయంలో ఇవాళ ఉదయం అచ్చెన్నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీ అధ్యక్షుడిగా యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు ప్రచారంలో ఉన్న సంగతి కూడా తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తక్కువ మాట్లాడడం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుందని, అజ్ఞానం బయటపడదని తెలిపారు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లపాటు అలాగే మౌనంగా ఉంటే బాగుండేదని, కానీ కొన్ని వ్యాఖ్యలతో తనను తాను బయటపెట్టుకున్నాడని వివరించారు. రామ్మోహన్ నాయుడు ఏ రకంగా చూసినా లోకేశ్ బాబుకు సమవుజ్జీనే అన్న విషయం ఇప్పుడర్థమవుతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడా పార్టీకి కావాల్సింది ఇలాంటి వారేనంటూ ఎద్దేవా చేశారు.
తక్కువ మాట్లాడం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది. అజ్ఞానం బయట పడదు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్ పోజ్ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేశ్ బాబుకి సమఉజ్జీనే. డౌటే లేదు. ఆ పార్టీకి కావాల్సింది ఇలాంటి వారే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 12, 2020