కరోనా అన్ని దేశాలను విజయవంతంగా చుట్టేస్తూ తన ప్రాబల్యాన్ని చాటుకుంటుంది.. ఇప్పటి వరకు ఆలయాల్లో దీని ఉనికి కనిపించలేదని అనుకుంటున్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నమ్మలేక పోతున్నారా.. నిజమండి బాబు.. టీటీడీ అనుబంధ ఆలయమైన గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో సహా ఉద్యోగుల్లో కూడా ఆందోళన మొదలైంది..
ఇకపోతే కరోనా వల్ల అన్ని ఆలయాలు మూసివేసిన విషయం తెలిసిందే.. ఇక లాక్ డౌన్ తర్వాత టీటీడీ ఆలయం తెరుచుకున్న క్రమంలో గోవింద రాజుల స్వామి గుడి శానిటరీ ఇన్స్పెక్టర్ కు కరోనా రావటంతో తిరిగి ఆలయాన్ని రెండు రోజుల పాటు అంటే నేడు రేపు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.. ఇకపోతే ఆలయానికి విధులు నిర్వహించడానికి వచ్చిన ఈయన జ్వరం..జలుబు..దగ్గులతో బాధపడుతుండటంతో అనుమానించిన సిబ్బంది కరోనా టెస్ట్ లు చేయించగా, ఈరోజు వచ్చిన అతని రిజల్ట్స్ లో ఈ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆలయంలోని మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇక ఇప్పుడు అందరు గమనించవలసిన విషయం ఏంటంటే.. సాధ్యమైనంత వరకు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడటం మంచిది.. ఒకవేళ ఆలయ సందర్శనాలకు వెళ్లినప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే కరోనా రక్కసి కోరల్లో చిక్కక తప్పదు..