అమెజాన్ ఉద్యోగి ఆగ్రహం…. సంస్థకి తీవ్ర నష్టం…!

-

ఒక వ్యక్తి ఆగ్రహం సంస్థ కి తీవ్ర నష్టం కలిగేలా చేసింది. అయితే అసలు ఏం జరిగింది…? అమెరికా లో అమెజాన్ లో పని చేసే ఉద్యోగికి ఆగ్రహం వచ్చింది. దీని కారణం గానే ఆ సంస్థకు దాదాపు రూపాయలు 45 లక్షలు (60 వేల డాలర్లు) నష్టం కలిగింది. అమెజాన్ లో పని చేస్తున్న స్టీవెన్ కోహెన్ అనే ఉద్యోగి తన కారు తో అమెజాన్ కేంద్రం లోకి దూసుకెళ్ళాడు. దీని కారణంగా భవనం ముందు వైపు ఉన్న తలుపులు బద్దలైపోయాయి. దీనితో ఇది ముగిసి పోలేదు.

amazon
amazon

ఆ తర్వాత తను అక్కడి తో ఆపక ఇదే తరహా లో అరాచకం సృష్టించాడు. సదరు ఉద్యోగి కారును భవనం వైపునకు తీసుకెళ్లి అక్కడ ఇదే తరహాలో దూసుకెళ్ళాడు. దీనితో భారీగా నష్టం వచ్చింది. ఈ దెబ్బతో అమెజాన్ కి అరవై వేలు డాలర్లు నష్టం కలిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొలరాడో రాష్ట్రంలోని థార్న్‌ టర్న్ లోని శనివారం రాత్రి అమెజాన్ కేంద్రం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతను అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటని పరిశీలిస్తూ ఉంటే… కనీసం ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ ఏ గొడవ జరగలేదని తేలింది. ఎవరి తోనూ కూడా కలహాలు లేదట. ఏది ఏమైనా అతని ఆగ్రహం తీవ్ర నష్టానికి దారి తీసింది.

ఎవరి తోనూ గొడవ లేకపోయినా అతను అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news