తిరుమలలో శ్రీవారి దర్శనాలను కొన్ని వారాల పాటు ఆపాలని టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు ప్రభుత్వాన్ని కోరారు. ఆలయంలో అర్చకులకు ప్రత్యామ్నాయం లేదని, వారి స్థానంలో మరొకరిని నియమించడానికి వీలుకాదని స్పష్టం చేశారు. ఆగమ సలహాదారుగా కొన్ని వారాలపాటు దర్శనాలు ఆపాల్సిందిగా సలహా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వరునికి నిత్య ఆరాధనలు ఆపితే మానవ జాతికి మంచిది కాదని.. పూజా కైంకర్యాలు ఏకాంతంగా కొనసాగించి అర్చకులను కాపాడాలని ఆయన కోరారు.
@ysjagan @yvsubbareddymp As an advisor I mention that archakas are irreplaceable. Aradhana to Srivaru should not be stopped even a single day. It is not good to the human race. I suggest to stop the darshans for a few weeks to protect archakas and to continue puja in ekantham.
— Ramana Dikshitulu (@DrDikshitulu) July 17, 2020
సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్వీటర్ ద్వారా తన సూచనలను అందించారు. టీటీడీలో ఇప్పటి వరకు 140 కేసులు నమోదు అయ్యాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో అధికారులతో, అర్చకులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన… తిరుమలలో అధిక శాతం ఏపీఎస్పీలో పని చేసే సెక్యురిటి సిబ్బందికి, పోటు కార్మికులకే కరోనా నిర్ధారణ అయిందని వివరించారు.