శాండ్ ఆర్ట్ తో సందేశం..? కళాకారుడా భళా..!

-

కరోనా మహమ్మారి ప్రజలని పీడుస్తోంది. ఇటువంటి సమయం లో జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం. మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించడం జాగ్రత్తలు తీసుకోవడం చేస్తే ఈ ప్రమాదాన్ని మనం ఆపగలం. అయితే ఇదే విషయంని ఒక కళాకారుడు తన ప్రతిభ తో చూపించాడు. ఫేస్ మాస్క్ ని ఎలా ధరించాలో తన శాండ్ ఆర్ట్ ద్వారా చూపించాడు. ఫేస్ మాస్క్ ని ముక్కు, నోరు అంతటా కూడా కప్పుకోవాలి. కానీ కొందరు ఈ మాస్క్ ని కూడా సరిగ్గా ఉపయోగించడం లేదు దీని వల్ల ఇబ్బందులు వస్తాయని ఆర్ట్ తో చూపించాడు సుదర్శన్ పట్నాయక్.

ఒడిశా లోని పూరి బీచ్ లో తను ఈ ఆర్ట్ చూపించి ప్రశంసలు పొందాడు. దీనిలో సరైన మార్గం లో ఫేస్ మాస్క్ ధరించాలని మెసెజ్ ఇచ్చాడు ఈ కళాకారుడు. సుదర్శన్ పట్నాయక్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news