మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. “కరోనా లక్షణాలని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నాను. ఆ పరీక్షలో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కోవిడ్ పరీక్షలు నిర్వహించుకోండి. ఇదే నా విన్నపం. వారందరూ హోం క్వారంటైన్‌లోకి వెళ్ళండి” అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
मेरे प्रिय प्रदेशवासियों, मुझे #COVID19 के लक्षण आ रहे थे, टेस्ट के बाद मेरी रिपोर्ट पॉज़िटिव आई है। मेरी सभी साथियों से अपील है कि जो भी मेरे संपर्क में आए हैं, वह अपना कोरोना टेस्ट करवा लें। मेरे निकट संपर्क वाले लोग क्वारन्टीन में चले जाएँ।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020
కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ కొనసాగుతున్నాయి.మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 30వేలు దాటింది. దీంతో అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.