కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు గూగుల్‌ శుభవార్త..!

-

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సమాచారం. వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పెంచేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిర్ణయించారని సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌లో 2లక్షల మంది రిగ్యూలర్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సేవలందిస్తున్నారు.

దేశంలో పనిచేస్తున్న గూగుల్‌ ఉద్యోగులకు ఈ వెసలుబాటు వర్తించనుంది. ఒకవేళ ఇదే నిజం అయితే వర్క్ ఫ్రం హోంను ఈ స్థాయిలో పొడిగించిన తొలి కంపెనీ గూగుల్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ దేశంలో 75,000కోట్ల డిజిటల్‌ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news