ఆదివారం ఉదయం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం సంచలనం సృష్టించింది. రమేష్ హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ కేర్ సెంటర్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు మరణించగా ఆ తర్వాత నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాసేపటి క్రితం మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
వీరు అందరూ కరోనా రోగులు అని తెలుస్తుంది. మరి కొంత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై సిఎం జగన్ స్పందించారు. ఘటనపై ఆయన హోం మంత్రిని నివేదిక అడిగారు. ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కరోనా రోగులు కొందరు ఆస్పత్రి పై నుంచి దూకారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, హోం మంత్రి సుచరిత ఘటనా స్థలంలోనే ఉన్నారు.