కర్నూలు జిల్లా లోని ఆ ఊరికి ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ ఊరి భోముల్లో వజ్రాలు, బంగారు నిక్షేపాలు కూడా ఉన్నట్లు భూగర్భ పరిశోధన సంస్థ నిర్దారించింది. తొలకరి వర్షం కురవగానే చుట్టుపక్కల ఉన్న జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, తుగ్గలి ప్రాంత పొలాలు వజ్రాల అన్వేషకులతో కిటకిటలాడుతాయి. వజ్రాల వెతకడం కోసం చాలా మంది తుగ్గలి పరిసర ప్రాంత పొలాలకు వస్తారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ దొరికిన వజ్రాలను బహిరంగ వేలంలో కాకుండా వ్యక్తిగతంగా కొనేందుకు వ్యాపారులు ముందు ప్రయత్నాలు చేస్తారు.
దానికి ఆ వజ్రం లభించిన వ్యక్తి అంగీకరించకపోతే బహిరంగ వేలానికి పోటీ పడతారు అక్కడి వ్యాపారులు. తాజగా తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో వ్యవసాయ కూలీకి వజ్రం లభ్యమయింది. అయితే అందరిలా వేటకి వెళ్ళినప్పుడు కాకుండా ఈయన పొలం పనికి వెళ్ళినప్పుడు ఆ వజ్రం దొరికింది. ఇక ఈ వజ్రాన్ని ఓ వజ్రాల వ్యాపారి 9 లక్షలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అలా నిన్నటి దాకా ఒక సామాన్య వ్యవసాయ కూలీగా ఉన్న అతను ఈరోజు లక్షాధికారి అయిపోయాడు.