బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అలాగే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. అదేవిధంగా ఇటు బాలీవుడ్, అటు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ కేసు తీవ్ర దుమారం రేపుతుంది. కాగా, తాజాగా సుశాంత్ సింగ్ కేసుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ‘ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. కానీ దానికి గురించి ఎందకింత చర్చిస్తున్నారు. నా దృష్టిలో ఇది అంత పెద్ద విషయమేమీ కాదు.
It is unfortunate that a person died by suicide, but why is it being discussed so much? I don't think it is such a big issue. A farmer told me that over 20 farmers have died by suicide, nobody spoke about it: NCP chief Sharad Pawar #SushantSinghRajputDeathCase https://t.co/LsHJ8gaQwr
— ANI (@ANI) August 12, 2020
20 మందికి పైగా రైతులు చనిపోతున్నారని, వాళ్ల గురించి ఎవరూ పట్టించకోవడం లేదు.’ అని ఆయన అన్నారు. తాను 50 ఏళ్లుగా ముంబై, మహారాష్ట్ర పోలీసులను చూస్తున్నానని, వారిపై తనకు నమ్మకం ఉందని శరద్ పవార్ అన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని ఎవరైనా అనుకుంటే తాను వ్యతిరేకించనని తెలిపారు.