ఒక్క వాట్సాప్ మెసేజ్ లేదా ఫోన్ కాల్.. ఎస్‌బీఐ ఏటీఎం మీ ఇంటికే వ‌స్తుంది..!

-

కరోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో చాలా మంది ఏటీఎంల‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇక చాలా చోట్ల ఏటీఎంల‌లో న‌గ‌దు నిల్వ‌లు లేక వినియోగ‌దారుల‌కు న‌గ‌దు ల‌భించ‌డం లేదు. అయితే ఈ ఇబ్బందుల‌కు చెక్ పెట్టేందుకు ఎస్‌బీఐ కొత్త‌గా డోర్ స్టెప్ ఏటీఎం స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని వ‌ల్ల ఎస్‌బీఐ ఖాతాదారులు కేవ‌లం ఒక్క వాట్సాప్ మెసేజ్ లేదా ఫోన్ కాల్ చేస్తే చాలు.. మొబైల్ ఏటీఎం వారి ఇళ్ల వ‌ద్ద‌కే వ‌స్తుంది. అందులో నుంచి వారు సుల‌భంగా న‌గ‌దు తీసుకోవ‌చ్చు.

one whatsapp message or phone call sbi mobile atm arrives at door step

అయితే ఎస్‌బీఐ ప్ర‌వేశ‌పెట్టిన డోర్ స్టెప్ ఏటీఎం స‌ర్వీస్ ప్ర‌స్తుతం ల‌క్నోలో మాత్ర‌మే అందుబాటులో ఉంది. దీన్ని అక్క‌డ ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నారు. విజ‌య‌వంతం అయితే దేశ‌వ్యాప్తంగా ఈ సేవ‌ను త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి తేవాల‌ని ఎస్‌బీఐ భావిస్తోంది. ఈ విధానం ద్వారా క‌స్ట‌మ‌ర్లు ముందుగా ఎస్‌బీఐకి చెందిన 7052-911-911 అనే నంబ‌ర్‌కు వాట్సాప్‌లో త‌మ ఇంటి చిరునామా పంపించాలి. లేదా ఈ నంబ‌ర్‌కు కాల్ చేసి కూడా చెప్ప‌వ‌చ్చు. దీంతో ఎస్‌బీఐ సిబ్బంది మొబైల్ ఏటీఎంను క‌స్ట‌మ‌ర్ ఇంటికి తీసుకువ‌స్తారు. అందులో నుంచి సుల‌భంగా న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

కాగా ఎస్‌బీఐ ఇటీవ‌లే త‌న సేవింగ్స్ ఖాతాదారుల‌కు మినిమం బ్యాలెన్స్ చార్జీల‌ను తొల‌గించింది. అలాగే బ్యాంకింగ్ లావాదేవీల‌కు పంపించే ఎస్ఎంఎస్ అల‌ర్ట్స్‌కు వ‌సూలు చేసే చార్జీల‌ను కూడా తీసేసింది. ఇక ఇప్పుడు తాజాగా డోర్ స్టెప్ ఏటీఎం స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సేవ త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news