సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈరోజు ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఇంట్లోని బాత్ రూమ్ లోనే కుప్పకూలినట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ మొదలు అయిన నాటి నుండి ఆయన తన సొంత ఊరు గుంటూరులోనే ఉంటున్నారు. అవడానికి గుంటూరు వ్యక్తి అయిన ఆయన రాయలసీమ యాసలోనే ఫేమస్ అయ్యాడు.
సినిమాల్లో అరుదైన పాత్రలు పోషించిన ఆయన నాటక రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్ లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. ఈ యన 1946 మే 8 న కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన గుంటూరులో సెటిల్ అయ్యారు.