బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు ఎప్పుడంటే..!

-

బాబ్రీ మసీదు కూల్చివేతపై రేపు తీర్పు వెల్లడికానుంది. ఇప్పటికే విచారణ పూర్తి కావడంతో లక్నోలోని సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. దీంతో కేంద్రం ఆదేశాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మతపరమైన ఘర్షణలకు తావులేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఆనాడు జరిగిన ఘటనపై న్యాయస్థానం ఎలా స్పందించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు.

శ్రీరాముడి జన్మస్థానంలో ఆలయాన్ని కూల్చి 16వ శతాబ్ధంలో నిర్మించారంటూ అప్పట్లో పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇటీవల సుప్రీం కోర్టు కూడా అది రామ జన్మభూమిగానే పేర్కొంది. ఇకపోతే ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌, ఉమాభారతిలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో వీరిపై కుట్రపూరిత ఆరోపణగా పేర్కొనగా 2001లో దాన్ని కొట్టివేసింది. సుప్రీంకోర్టు జోక్యంతో 2017లో అద్వానీతో పాటు ఇతరులపై నమోదు అయిన నేరపూరిత అభియోగాలను రిస్టోర్ చేశారు. ఈ అంశంపై తుది తీర్పు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news