సుప్రీంకు సుగాలి ప్రీతి కేసు..’నిర్భయ’ న్యాయవాదితో !

-

ఏపీలో సంచలనం సృష్టించిన కర్నూలు ప్రీతి సుగాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకు వెళ్లనున్నట్టు చెబుతున్నారు. 2017లో కట్టమంచి రామలింగ రెడ్డి స్కూల్ లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి పై అత్యాచారం చేసి స్కూల్ యాజమాన్యానికి చెందిన వ్యక్తులు హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. తన కూతురి పై జరిగిన అత్యాచారం,హత్య పై సీబీఐ విచారణ చేయాలని ఐదు రోజులుగా ఢిల్లీలో ఉన్న అందరు ప్రముఖులను సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కలుస్తున్నారు.

ఈ క్రమంలో తమ కూతురు పై జరిగిన అత్యచారం, హత్య కు కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ఎస్సి కమిషన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిశారు. చివరిగా నిర్భయ కేసును వాదించిన న్యాయవాది సీమా కుష్వాహను కలిసి న్యాయం చేయాలని కోరారు ప్రీతి కుటుంబ సభ్యులు. దీనికి సానుకూలంగా స్పందించిన న్యాయవాది సీమా కుష్వాహ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news