కరోనా వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్ కి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్… వ్యాక్సిన్ కి సంబంధించి రెగ్యులేటరీ ఆమోదం పొందిన తర్వాత రాబోయే నెలల్లో ఇంట్రానాసల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల చివరి దశ క్లినికల్ ట్రయల్స్ ను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆదివారం తెలిపారు.
చివరి దశ ట్రయల్స్ లో వేలాది మంది పాల్గొంటారని ఆయన చెప్పారు. 40 వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉండవచ్చు అని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం 3 వ దశ ట్రయల్స్ లో ఉన్న టీకాల్లో అన్నీ కూడా ఇంజెక్షన్ ద్వారా అందిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కాగా శనివారం, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మరియు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కు భారత్ లో క్లీనికల్ ట్రయల్స్ మొదలు పెట్టారు.