స్వంత పార్టీ కార్యకర్తలను, వారికి ఇచ్చిన హమీలను నిలబెట్టుకోని బీజేపీ రేపు ప్రజలకు ఇచ్చిన మాట ఎలా నిలబెడతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ ఓటమిని గ్రహించి ఆ నేతలు ఫస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే వారు డబ్బులు నమ్ముకున్నారని ఆయన అన్నారు. మొన్న హైదరాబాద్ వద్ద దుబ్బాకకు డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందేనన్న ఆయన సిద్దిపేటలో ఆభ్యర్థి ఇంట్లో డబ్బులు దొరికితే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఆ డబ్బులను గుండాల్లా బీజేపీ కార్యకర్తలు గుంజుకుపోయారని అన్నారు.
తప్పుు చేయకపోతే పోలీసులకు సహకరించాలన్న ఆయన ఇవాళ సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ ఇంటిలో పోలీసులు సోదాలు జరిపారని, బెడ్ ను చింపి మరీ వెతికారని అన్నారు. నా కారును, మా అభ్యర్థి కారును ఆపి సోదాలు చేశారు. ఆపినా చోటల్లా మేం సహకరించామని అన్నారు. వెనకటికి దొంగ దొరికాక తానే దొంగ దొంగ అని అరిచారట. ఇవాళ సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలు ఇదే చేశారని అన్నారు. ఎన్నికల్లో పంచడానికి డబ్బులు తెస్తారు. పోలీసుల సోదాలో దొరికితే మీరే దొంగ దొంగ అని అరుస్తారు. ప్రజలకు మీ గురించి తెలుసన్న ఆయన ఓటమి ఫస్ట్రేషన్లో బీజేపీ గొడవలు సృష్టిస్తోందన్న ఆయన కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. అంగీ చింపుకుని..మనమే చింపామని గొడవ చేస్తారు. జాగ్రత్తగా ఉండండని ఆయన అన్నారు.