ఇంగ్లీష్ మీడియం.. రఘురామ ఆసక్తికర కామెంట్..!

-

మరికొన్ని రోజుల్లో పాఠశాలను ప్రారంభించేందుకు జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. నవంబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునః ప్రారంభం కానున్నాయి. అయితే పాఠశాలలో జగన్ సర్కార్ ఏ మీడియంలో విద్యాబోధన చేయనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై స్పందించిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వం తలపెట్టిన ఇంగ్లీష్ మీడియం పై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది అంటూ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న మరోవైపు పాఠశాలను ప్రారంభించి ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. అదే సమయంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లో ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆవేశం తగ్గించుకొని కాస్తోకూస్తో ఆలోచన పెంచుకుంటే మంచిది అంటూ వైసిపి రెబల్స్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news