వాట్సాప్ లో కూడా గ్యాస్ బుకింగ్…!

-

గ్యాస్ సిలెండర్ బుకింగ్ విధానం ఇండియన్ గ్యాస్ మార్చింది. నవంబర్ 1 నుండి, డెలివరీ మరియు ఎల్పిజి సిలిండర్లను బుక్ చేసే విధానం మారుస్తున్నట్టు ఇండియన్ గ్యాస్ ప్రకటన చేసింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ నుంచి మెసేజ్ ద్వారా కూడా మీరు గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా వాట్సాప్ ద్వారా కూడా సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు అని సంస్థ తెలిపింది.

1. గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్  తో మాట్లాడటం ద్వారా బుక్ చేసుకోవచ్చు. 2.మొబైల్ నంబర్ కు కాల్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. 3. Https://iocl.com/Products/Indanegas.aspx వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. సంస్థ వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ మెసెంజర్‌లో REFILL అని టైప్ చేసి 7588888824 కు పంపితే రీఫిల్ బుక్ అవుతుంది. కాగా కొత్త నంబర్ 7718955555 కు కాల్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news