ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ప్రారంభించినప్పటికీ… గతంలో వీఆర్వోల అలసత్వం ద్వారా పని జరిగక ఎంతో మంది రైతులు అయోమయంలో పడిపోయారు. గతంలో తమ పని జరగటానికి వీఆర్వోలకు భారీగా డబ్బులు ముట్టచెప్పిన వారు.. ప్రస్తుతం ధరణి పోర్టల్ రావడంతో విఆర్వోలు చేతులెత్తేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఏకంగా ఓ మహిళ అందరిముందే రెవెన్యూ అధికారి పై చెప్పులతో దాడి చేయడం సంచలనంగా మారిపోయింది.
ధరణి పోర్టల్ పై అవగాహన సదస్సు నిర్వహించగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవిన్యూ అధికారి పై చెప్పులతో దాడి చేసింది మహిళా. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో చోటుచేసుకుంది ఈ ఘటన. వీఆర్వో అవకతవకలు చేశారని.. తమ భూమి తక్కువగా ఉన్నట్లు పట్టాలు కూడా ఇచ్చాడు మార్పు కోసం ఎన్ని సార్లు తిరిగి నా పని చేయలేదని.. ఇప్పుడు వీఆర్వో వ్యవస్థ రద్దు అయ్యాక తనకి ఏమీ తెలియదు అంటూ చేతులెత్తేశాడు అంటూ ఆరోపించిన మహిళా చెప్పుతో దాడి చేసింది.