ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోం అనేది ఐటీ, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు అదనపు సదుపాయంగా ఉండేది. అనివార్య కారణాల వల్ల ఆఫీసుకు రాలేకపోతే ఇంటి నుంచే పనిచేయవచ్చు. అయితే ఇప్పుడు వర్క్ ఫ్రం హోం అనేది కేవలం వారికే కాదు, అనేక రంగాలకు చెందిన ఉద్యోగులకు నిత్య కృత్యంగా మారింది. ఈ క్రమంలోనే ఇంటి వద్ద ఉండి పనిచేసేందుకు కావల్సిన చక్కని కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్‌టాప్‌లను ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారు కింద తెలిపిన 5 ల్యాప్‌టాప్‌లను గమనించవచ్చు. ఇవి ధర తక్కువ ఉండడమే కాదు, ఉద్యోగులకు సరిగ్గా ఉపయోగపడతాయి. వాటి వివరాలను కింద తెలుసుకోవచ్చు.
1. అసుస్ వివోబుక్ 15 ఎం509డీఏ
ఈ ల్యాప్‌టాప్‌లో అధునాతన ఏఎండీ అథ్లాన్ సిల్వర్ సీపీయూ లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ రేడియాన్ వెగా గ్రాఫిక్స్ లభిస్తాయి. 4జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్, 15.6 ఇంచ్ డిస్‌ప్లే, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.29,985.
2. లెనోవో ఐడియా ప్యాడ్ ఎస్145
ఇందులో పవర్‌ఫుల్ రైజన్ 3 3200యు సీపీయూ లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ రేడియాన్ వెగా గ్రాఫిక్స్, 4జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డ్రైవ్, 15.6 ఇంచ్ డిస్‌ప్లే, విండోస్ 10 హోం ఓఎస్ లభిస్తాయి. దీని ధర రూ.28,990.
3. ఏసర్ వన్ జడ్2-485
ఇందులో ఇంటెల్ పెంటియం గోల్డ్ 4415యు ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డ్రైవ్, విండోస్ 10, 14 ఇంచ్ డిస్‌ప్లే లభిస్తాయి. ఈ ల్యాప్ టాప్ ధర రూ.26,980.
4. అసుస్ ఇ410ఎంఏ
ఇందులో 14 ఇంచుల డిస్ప్లే, ఇంటెల్ పెంటియం సిల్వర్ ఎన్5030 సీపీయూ, 4జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ ఫీచర్లు లభిస్తాయి. ధర రూ.29,999.
5. హెచ్‌పీ 250 జి7 2ఎ9ఎ5పిఏ
ఇందులో ఇంటెల్ సెలరాన్ ఎన్4020 సీపీయూ, 4జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డ్రైవ్, 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 720పి వెబ్‌క్యామ్ లభిస్తాయి. ధర రూ.28,999.