సికింద్రాబాద్ కోర్టు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల అత్యుత్సాహంతో అక్కడ ఈ పరిస్థితి నెలకొంది. భార్గవ్ రామ్ లొంగిపోతాడన్న సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు, కోర్టు లోపలకి వచ్చి భార్గవ్ రామ్ లొంగిపోతాడాని ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు, బారికేడ్లు పెట్టి కోర్టు తలుపులు మూసివేసినట్టు తెలుస్తోంది.
వాయిదాల కోసం వచ్చిన వారిని కోర్టు బయటే ఉంచారు పోలీసులు. దీంతో పోలీసులకు, అడ్వకేట్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ ని ఏ3గా చేర్చారు. ఆయన కేసు నమోదయిన నాటి నుండే పరారీలో ఉన్నాడు. ఆయన ముందు బెంగళూరు అటు నుండి మైసూరు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆయన కోర్టులో లొంగిపోతాడు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.