హైదరాబాద్‍లో బాలుడి పైశాచికం..

-


మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలను చూడటం అలవాటు పడిన మాదాపూర్ లోని ఓ బాలుడి…పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న 30 మంది అమ్మాయిలను నగ్న వీడియోలు తీస్తూ వయసుకు మించిన నేరాన్ని చేశాడు. అమ్మాయిలు బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా.. హాస్టల్ ప్రక్కనే ఉన్న బిల్డింగ్‌లో నుంచి బాలుడు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ ఫ్లాష్‌ లైట్ వెలగడంతో ఓ అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి తోటి స్నేహితులకు తెలియజేయగా బాలుడి బాగోతం బట్టబయలైంది. దీంతో ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాలుడు 8వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులే సెల్‌ఫోన్ కొనిచ్చిట్టుగా దర్యాప్తులో తేలింది. యువతుల వీడియోలు తన వద్దే ఉంచుకున్నాడా? లేక ఎవరికైన పంపిచాడా అనే విషయాన్ని సైతం పోలీసులు కూపీ లాగుతున్నారు. పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు మొబైల్ ఫోన్లను కొనిస్తే వాటిని దుర్వినియోగం చేస్తూ..చెడు అలవాట్లకు లోను కావడం ముమ్మాటికి తల్లిదండ్రుల కల్పిస్తున్న స్వేచ్చకు మూల్యమే అంటున్నారు కొందరు.

Read more RELATED
Recommended to you

Latest news