రామ మందిర నిర్మాణ విరాళాల విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పానని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. దీన్ని కొంతమంది వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. నేను కూడా రాముడి భక్తుడినే…నేను కూడా అయోధ్యకు వెళ్తానని ఆయన అన్నారు. దీనిపై రాజకీయం చేయడం తగదు…నేను ఉద్దేశ్య పూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.
హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని యాన అన్నారు. నా దగ్గరికి ఎవరైనా రామ మందిర నిర్మాణ నిధికి విరాళాలు అడిగినా నేను ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. బిజేపీ నేతలు మత రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని నా సలహా అని ఆయన పేర్కొన్నారు. ఇక నాకు మా ముఖ్యమంత్రి గారికి కూడా దైవభక్తి చాలా ఎక్కువన్న ఆయన ఇక ఈ వివాదాన్ని ఇంతటితో ఆపాలని కోరారు.