అది ఆడితే విలన్ గా కొనసాగేవాడిని..!

-

ఈ కాలంలో సంవత్సరానికి 1 సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉన్న ఈ టైంలో 100 సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు. స్టార్స్ తో పాటుగా ఆ రేర్ ఫీట్ సాధించాడు హీరో శ్రీకాంత్. 100వ సినిమాగా మహాత్మ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తున్నాడు శ్రీకాంత్. ఈమధ్య విలన్ రోల్ మీద మోజు పెంచుకున్నాడు ఈ లవ్లీ హీరో.

ఆల్రెడీ నాగ చైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం సినిమాతో విలన్ గా ట్రై చేశాడు శ్రీకాంత్. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే కనుక విలన్ గా కొనసాగించే వాడిని అంటున్నాడు శ్రీకాంత్. లెజెండ్ ముందు దాకా జగపతి బాబు పరిస్థితి ఇదే విధంగా ఉండేది. లెజెండ్ నుండి రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత వరకు విలనిజంలో జెబి అదరగొడుతున్నాడు.

శ్రీకాంత్ కూడా విలన్ గా హిట్ కొడితే అలానే కొనసాగే వాడిని అయితే హీరోగా ఇంకొద్ది రోజులు చేయాలనే ఉద్దేశంతో పేక్షకులు నన్ను విలన్ గా యాక్సెప్ట్ చేయలేదని అంటున్నాడు శ్రీకాంత్. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉండగా విలన్ గా ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తా అంటున్నాడు శ్రీకాంత్.

Read more RELATED
Recommended to you

Latest news