అమ్మాయి- అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ టైమ్ లో కాలం చకచకా గడిచిపోతుంది.చుట్టూ ప్రపంచం ఆగిపోయినట్టు తాము మాత్రమే లోకంలో ఉన్నట్టు తోస్తుంది. అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని విషయాలే ఇద్దరి మధ్య విభేధాలని తీసుకువస్తాయి. అబ్బాయిలు మాట్లాడే కొన్ని విషయాలు అమ్మాయిలకి నచ్చవు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నువ్వు లేక నేను లేనని పదే పదే చెప్పడం ప్రతీ సారీ కరెక్ట్ కాదు. నువ్వున్నావు కాబట్టే నేనిలా ఉన్నానని చెబుతూ ఉంటే వారికి ఒకానొక దశలో చిరాకు వచ్చే అవకాశం ఉంది. పరస్పరం ఆధారపడడం కరెక్టే అయినా కొన్ని విషయాల్లో అది బెడిసి కొడుతుంది. అందుకే నువ్వే నా సర్వస్వం లాంటి మాటలని తరచూ వాడవద్దు.
మిమ్మల్ని మీరు మర్చిపోవడం కూడా అమ్మాయిలకి నచ్చదు. మీరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు. అంతకుముందు డైలీ జిమ్ కి వెళ్ళి, వర్కౌట్లు చేసి అమ్మాయిని ప్రేమలోకి దింపారు. ఒక్కసారి ప్రేమలో పడ్డాక మామూలుగా అయిపోయి అన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవడం వారికి నచ్చదు.
పదే పదే పాత గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే చికాకు పుడుతుంది. కొందరు మగాళ్ళకి తమ పాత గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పుకోవడం గర్వంగా ఉంటుందేమో! కానీ అలా చెప్పుకుంటూ పోతే ఉన్న గర్ల్ ఫ్రెండ్ దూరమయ్యే ఛాన్స్ ఎక్కువ.
ఆమె చెప్పిన ప్రతీదానికి అవునన్నట్టు తల ఊపడం. అమ్మాయి ఏదీ చెప్పినా మొదట్లో బాగానే ఉంటుంది. కానీ ప్రతీదానికి అవునని చెబుతూ తను చెప్పిందానికల్లా తల ఊపుతూ ఉంటే ఆమెకి నచ్చదు. పట్టూ విడుపూ అనేది తప్పక ఉండాల్సిందే.