ఇక్కడ మూడు విధానాలు ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే ఉద్యోగం చేయవచ్చు. పైగా మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది. ముఖ్యంగా మహిళల కి ఇది చక్కగా, సదుపాయంగా ఉంటుంది. కాబట్టి వీటి కోసం ఈరోజే తెలుసుకోండి. దీనితో మీరు ఈజీగా డబ్బులు సంపాదించచ్చు.
ట్రాన్స్లేషన్:
ఈ మధ్య కాలం లో ట్రాన్స్లేషన్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. చాలా వెబ్ సైట్లు ట్రాన్స్లేటర్ లు కావాలి అని అంటున్నారు. ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, జర్మన్ ఇలా వివిధ భాషల్లో మీరు ట్రాన్స్లేషన్ చేయగలిగితే మీరు సంపాదించొచ్చు. పైగా అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ట్రాన్సలేషన్ స్కిల్స్ కనుక మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.
దీనితో పదానికి రూపాయి నుంచి మూడు రూపాయల వరకు వస్తాయి. ఒక పేజి ట్రాన్స్లేషన్ చేశారంటే 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వస్తాయి. Freelancer.in, Fiverr.com, worknhire.com, Upwork.com ఈ సైట్స్ లో మీరు ట్రాన్స్లేషన్ వర్క్ చూడొచ్చు. దీనితో మీరు ఈజీగా సంపాదించుకోవడానికి వీలవుతుంది.
ఆన్లైన్ ట్యూటరింగ్:
కొన్ని వెబ్ సైట్ లు ఆన్ లైన్ లో ట్యూషన్స్ చెప్పే వాళ్ళకి డబ్బులు ఇస్తాయి. మీరు ట్యూషన్స్ కనుక ఆన్లైన్ లో చెప్తే మంచిగా సంపాదించవచ్చు. దీని ద్వారా మీకు గంటకు 200 నుంచి 500 రూపాయలు వస్తాయి. Vedantu.com, MyPrivateTutor.com, BharatTutors.com tutorindia.net వంటి సైట్లను ఎంచుకోవచ్చు
యూట్యూబ్ ఛానల్స్ :
మీకు క్రియేటివిటీ లేదా మంచి రెసిపీస్ వండడం వస్తే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కేవలం ఇవే కాదు మీకు నచ్చిన వాటిని యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేయొచ్చు. యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళదే కాబట్టి యాడ్ సెన్స్ ఎకౌంట్ ఉంటే డబ్బులు వస్తాయి.