పందెం కోడి-2 బిజినెస్ బాగుంది

-

తెలుగు మూలాలున్నా తమిళంలో హీరోగా సెటిల్ అయిన విశాల్ 2005లో వచ్చిన పందెం కోడి సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత తను చేసిన తమిళ సినిమాలన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నా పెద్ద ప్రయోజనం ఏమి కనిపించలేదు. అయితే ఈమధ్య వచ్చిన అభిమన్యుడు విశాల్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది. తమిళ డబ్బింగ్ సినిమాలకు ఈమధ్య టైం బ్యాడ్ నడుస్తుంది. మన దగ్గర అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.

విశాల్ మాత్రం పందెం కోడి-2 తెలుగు రైట్స్ భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. సూపర్ హిట్ సినిమా సీక్వల్ కాబట్టి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. లింగుసామి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఈ సినిమాను 10 కోట్లకు కొనేశారట. ఆంధ్రా 6 కోట్లకు అమ్ముడవగా గుంటూరు, నెల్లూరు రైట్స్ యువి వారు కొనేశారట.

నైజాంలో సొంతంగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తంగా పందెం కోడి-2 బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది. అంచనాలను అందుకుంటే మాత్రం ఈ సినిమా మళ్లీ తమిళ డబ్బింగ్ సినిమాలకు ఊపిరి పోసినట్టు అవుతుంది. దసరా బరిలో దిగుతున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాకు పోటీగా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news