పది, ఇంటర్‌ పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

-

పది, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో కొన్ని రోజుల నుంచి ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలతో సహ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ఏపీ సర్కార్ పరీక్షలు నిర్వహించి తీరుతామని మొండి పట్టుతో ఉంది. అయితే తాజాగా పది, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని..విద్యార్థుల ఆరోగ్యం, వారి భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని.. పరీక్షలు ఎప్పుడు పెడతామనేది సరైన సమయంలో చెబుతామన్నారు. ఇక తగ్గించిన సిలబస్ లతో ఇప్పటికే పరీక్షలకు ప్రశ్నాపత్రాలు కూడా రూపొందించామని ఆయన అన్నారు. నారా లోకేష్ కు దొరికినట్టు అందరికీ సత్యం రామలింగరాజులు దొరకరని.. పరీక్షలపై లోకేష్ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news