కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రాల్లోని కార్మికులందరూ తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పారిశ్రామికవేత్తలను అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని వామపక్ష ప్రజా సంఘాలు విమర్శించాయి. రెండు రోజుల భారత్ బంద్‌కు 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించగా, ఆలిండియా కిసాన్ మహాసభ కూడా దీనిని స్వాగతించింది. సమ్మెలో భాగంగా రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు.
సాధారణ ప్రజలు, కార్మికులతో పాటు రైతులు కూడా పాలు పంచుకుంటున్నారు. మొత్తం 12 డిమాండ్ లలో పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అటు బ్యాంకులు, క్యాబ్స్, ఆటో లతో పాట అనేక కార్మిక సంఘాలకు సంబంధించిన ట్రేడ్ యూనియన్లు ప్రశాంతంగా బంద్ ని కొనసాగిస్తున్నాయి.