హైదరాబాద్: మగువలకు బంగారం, వెండి ధరలు భారీ షాక్ ఇచ్చాయి. ఈ రోజు బంగారం, వెండి పోటీ పడి మరీ ధరలు పెరిగాయి. 24,22 క్యారెట్ల బంగారంపై రూ. 380, రూ.350 పెరిగింది. ఈ ధరలతో కలిపి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,370గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ.45,250గా విక్రయిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,170 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 47,400గా ఉంది. జైపూర్‌లో ఇదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,800 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 47,600గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం రూ.49,370 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 45,250గా ఉంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 6 వేలు పెరిగింది. పెరిగిన ధరతో కలిసి ఈ రోజు వెండి కేజీ రూ. 73,200గా ఉంది
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..