వైఎస్సార్ వర్ధంతి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల కు కర్తవ్య బోధ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు….ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అవినీతి రహిత పాలన, సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారని.. పదవుల విషయంలో అందరికి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇక్కడ కొన్ని ఆరోపణలు తన దృష్టికి వచ్చాయి…భూములు, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్షం ఆరోపిస్తోందని పేర్కొన్నారు.
తనకు డబ్బు మీద ఆసక్తి లేదు…హైదరాబాద్ లో ఉన్నది కూడా అద్దె ఇల్లే లేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని.. తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. ఇందు కోసం రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తాను…ఎవరైనా ఫిర్యాదూ చేయవచ్చన్నారు.తనకు విశాఖలో స్థిరపడాలనే కోరిక ఉందని….భీమిలి దగ్గర నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకుని జీవిస్తానని తెలిపారు. ఆ ఒక్కటి తప్ప భూములు, భవంతులపై తనకు ఆశ లేదని.. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే తన లక్ష్యమన్నారు.