ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగాయా..ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత..?

-

సంక్షోభంలోనూ సంక్షేమాన్ని వీడకుండా ప్రజలకు అండగా ఉంటున్న వైకాపా సర్కార్ గతంలో ఎన్నడూ లేని విధంగా దూసేకెళ్తుంది. చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకూ ఏదో ఒక రూపంలో సంక్షేమపథాకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కానీ ప్రతిపక్షాలు పదే పదే అంటున్న మాట..అప్పులు పెరుగిపోతున్నాయి. పరిమితికి మించి అప్పులు చేస్తుంది. అప్పులపై కాగ్ లెక్కలు ఏం చెబుతున్నాయి..అదనపు రుణాలు ఇవ్వటానికి కేంద్రం రాష్ట్రాన్ని ఎలాంటి చిక్కుముడుల్లో పెడుతుంది. ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈరోజు మీకోసం.

కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 9వేల కోట్లు అప్పుచేస్తున్నట్లు వెల్లడైంది. ఏప్రిల్- నవంబర్ లో ఈ అప్పు బాగా పెరిగింది. ఎనిమిది నెలల్లో 73,800కోట్లు అప్పుచేసింది. ఏడాదిలో 48వేల కోట్లు మాత్రమే అప్పుచేస్తామని బడ్జెట్ లో చెప్పారు. కానీ 8నెలల్లోనే దాదాపు 74వేల కోట్లు చేసిందంటే రాష్ట్ర్ర ప్రభుత్వం పై అప్పుల భారం ఏ విధంగా ఉండబోతుందే మీకే తెలియాలి.

విభజనసమయానికి రాష్ర్ట ప్రభుత్వానికి ఉన్న అప్పులు 97వేల కోట్లు. చంద్రబాబు నాయుడు తన అయిదేళ్ల పాలనలో లక్షా 62వేల కోట్లు అప్పు అయింది. జగన్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే లక్షా 7వేల కోట్లు అప్పుచేసింది. ఈ లెక్కన ఇంకా నాలుగేళ్లలో కనీసం 4లక్షల కోట్లైన అప్పుచేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే 2024 నాటికి 6 లక్షల కోట్లు అవ్వొచ్చు.

ఎందుకు ఇంత అప్పుచేయాల్సి వస్తుంది?

జగన్ సర్కార్ మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలు అమలు చేయటానికే డబ్బును ఖర్చుపెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే అన్ని కార్పొరేషన్లో ఉన్న డబ్బును సంక్షేమపథకాల వైపు మళ్లించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవి చాలక కేంద్రం నుంచి అప్పుచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం షరతుల మీద అప్పు ఇవ్వటానికి అంగీకరించిందనే విషయం తెలిసిందే.

తాజాగా కేంద్రం రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. బుుణపరిమితిని 42వేల 472కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే రాష్ట్ర స్తూల ఉత్పత్తిలో 3.5% కింద తొలుత 37వేల 163 కోట్లను కేంద్రం నిర్థారించింది. కేంద్రం ఇచ్చిన పరిమితిని దాటి రాష్ట్రం రుణాలు తీసుకుంది. మొత్తంగా 17 వేల924 కోట్లు అధికంగా బుణం తీసుకున్నట్లు తేలింది. దీంతో కేంద్రం రుణపరిమితిని 27,669 కోట్లకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే అదనంగా మరో 5800 కోట్లకు అనమతిస్తామని కేంద్రం వెల్లడించింది.

బుణాలు ఇవ్వటానికి కేంద్రం రాష్ట్రానికి పెట్టిన షరుతులేంటి??

విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని తెలిపంది. అంటే డిస్కంలను ప్రైవేటికరణ చేయటం, రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించటం, ఇంకా వన్ నెషన్ వన్ కార్డ్ వంటివి అమలు చేయాలని తెలిపింది. మొదటి రెండు షరుతులకు విభిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి.

డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది?

విద్యుత్ సరఫరాలో వచ్చే నష్టాలపై ఇప్పటివరకూ స్పష్టమైన లెక్కలు లేవు. ఆకస్మికంగా పెరిగిన ఖర్చులను ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ కు అప్పగిస్తే అలా జరగదు. లెక్కదొరకని విద్యుత్ ఖర్చులన్నీ వినియోగదారల మీదకు మళ్లించే అవకాశం ఉంది. ఫలితంగా వినయోగదారలపై అదనపు భారం పడుతుంది.

ఇంతై ఇంతైన అన్నట్లు రుణాలను పెంచుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వంవైకాపా ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ‘ రంగుల రగడ ‘ భవిష్యత్ లో వచ్చే ప్రభత్వాలకు ఏం సమాధానం చెబుతుంది. అసలు ఒకవేళ ఇతర పార్టీలు నెగ్గితే ఈ అప్పుల ఊబిలో పనిచేయగలవా? స్తుస్తిరమైన ప్రభుత్వ లక్షణం ఇదేనా…పెట్టే ఖర్చు ఆదాయాన్ని మించకూడదు, కానీ ఇలా సంక్షేమపథకాలకు ఖర్చుపెడుతూ.. ప్రజలకు డబ్బులు పంచిపెడుతూ ఉంటే ఒక దశ వచ్చేసరికి కనీస సంక్షేమపథకాలను అమలు చేసే వీలుకూడా ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్షేమపథకాలు అమలు చేయటం తప్పుకాదు. ప్రజలకు అవి అవసరమే..కానీ దానికి ఒక పరిమితి ఉండాలని..ఆదాయాన్ని పెంచే ఖర్చులు చేయటంలో తప్పులేదు కానీ ఇలాంటి వాటివల్ల రాష్ట్ర భవిష్యత్ ఏంటిని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రానికి ఆదాయం తెచ్చే వనరులేవి??

రాష్ట్రానికి 5 వనరుల నుంచి ఆదయం వస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ ఆన్ ఫ్యూయల్, స్టాంప్స్ డ్యూటీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ ఇంకా కేంద్రం నుంచే వచ్చే ఆదాయం. లిక్కర్ మీద వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుంది. కేంద్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టే లాక్ డౌన్ లో ఆదాయం పెంచుకోవటానికి లిక్కర్ షాపులను తెరిచే ఉంచారు.
ఇంకా కేంద్రానికి వచ్చే లాభాల్లో 41% రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కొన్న ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చలనా కింద మనం ప్రభుత్వానికి కొంత చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా RTA, మైనింగ్, ఆస్తిపన్ను ద్వారా ఆదాయం వస్తుంది.

రాష్ట్రాలు వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చుపెడతాయి?

ఏ రాష్ట్రం అయినా తనకు వచ్చిన ఆదాయాన్ని మొదట మూలధనం పెంచేవాటిపైనే పెడతాయి. అంటే స్కూల్స్, కాలేజీలు, హాస్పటల్స్, రోడ్లు మీద అనమాట.! రెండోది రెవెన్యూ ఖర్చు. అంటే సంక్షేమపథకాలు అమలు చేయటంపై. వీటిమీద పెట్టె ఖర్చులో ఆదాయం రాదు. తీసుకున్న అప్పులు తీర్చటం, వడ్డీ కట్టటం పై కొంత ఖర్చుపెడుతుంది.

ఏ రాష్ట్రం కూడా తన స్థూల ఉత్పత్తిలో 3% అప్పులు దాటొద్దు. కాబట్టి అప్పులను డబ్బు రూపంలో కాకుండా..స్తూల ఉత్పత్తికి మించి తీసుకున్నాయా లేదా అనే కోణంలో చూడాలి. అప్పులు నిష్పత్తి 25% మించకూడదని 14 వ ఆర్థిక సంఘం చెబుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అప్పుల నిష్పత్తి 34.6% కు చేరినట్లు క్రేడిట్ రేటింగ్ సంస్థ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్, కర్ణాటక, మహారాష్ర్ట, తమిళనాడు రాష్ట్ర్రాల్లో అప్పులు ఎక్కువగా ఉన్నా…రుణ జీఎస్డీఏ నిష్పత్తిని దాటలేదు. కానీ ఏపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

వైకాపా సర్కార్ లో చిన్నాపెద్దా పేద బడుగు అన్ని వర్గాల వారికి చేయూత అందుతుందనే చెప్పాలి. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఇంట్లో ఉండే గృహిణిల వరకూ అందరూ వివిధ రకాల పథకాల ద్వారా లబ్ధిని పొందారు. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ గా ఉంది కానీ.. అప్పును స్థూల ఉత్పత్తికి మించి ఉందా లేదా అనే కోణంలో చూడాలి. అలా చూసినట్లైతే.. ప్రతిపక్షాలు చెప్పినట్లు ఊహించనంతగా లేకున్నా ఒకింత పెరిగాయి.. ఏ రాష్ట్రానికైన అప్పులుండటం సహజమే…అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని వైకాపా నాయకులు చెబుతున్నారు.

ఏదిఏమైనప్పటికి కరోనా పరిస్థితుల్లోనూ వైకాపా సర్కార్ ప్రజలకు సాయం చేస్తుందనే మాట వాస్తవం . భవిష్యత్ ఏంటనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పై మూడింతలు సమకూలతే ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news