ఆన్ లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. రోజు రోజుకీ సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తున్నారు. ఎంత భద్రంగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో మోసాలు జరుగుతూనే ఉన్నారు. మోసపోయే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. సైబర్ పోలీసులకు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సైబర్ మోసాల వలలో చిక్కుకోవడం ఆశ్చర్యకరం. తాజాగా ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్ సైబర్ నేరగాళ్ళకు చిక్కారు. దాదాపు 6లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నారు.
ఆన్ లైన్ లో కరెంటు బిల్లు కట్టిన ఎస్బీఐ మేనేజరుకు సందేశం వచ్చింది. క్విక్ సపోర్ట్ యాప్ ద్వారా కరెంట్ బిల్లు అప్డేట్ చేసుకోవాలని ఆ మెసేజ్ సందేశం. అప్డేట్ చేసుకుందామని యాప్ ఓపెన్ చేసిన మేనేజరుకు కొన్ని నిమిషాల తర్వాత షాక్ తగిలే వార్త తెలిసింది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న 5.80లక్షల రూపాయలు విత్ డ్రా అయినట్టు చూపించింది. దీంతో ఏమీ అర్థం కాక మరోమారు చెక్ చేసుకున్నారు. అంతా అయ్యాక సైబర్ నేరగాళ్ళే ఇలా చేసారని అర్థం చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతమ్ సైబర్ నేరగాళ్ళపై కేసు నమోదైంది.