ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే.. ఈ మ్యాచ్ లో 135 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించింది పంజాబ్ కింగ్స్ జట్టు. కేవలం 13 ఓవర్లలో మాత్రమే నాలుగు వికెట్లు కోల్పోయి 135 పరుగుల టార్గెట్ ను చేధించింది పంజాబ్ కింగ్స్.
పంజాబ్ బ్యాటింగ్ విషయానికొస్తే… కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎనిమిది సిక్సర్లు, 7 ఫోర్లతో 42 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ లందరూ విఫలమైనప్పటికీ.. తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు కె.ఎల్. రాహుల్. మయాంక్ అగర్వాల్ 12 పరుగులు, మర్క్రం 13 పరుగులు చేసి వెనుదిరిగారు.
అయినప్పటికీ చివరివరకు ఆడిన కేఎల్ రాహుల్.. సిక్సర్ తో జట్టును గెలిపించాడు. చెన్నై బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ టార్గెట్ తక్కువగా ఉండటంతో పంజాబ్ కింగ్స్ సులభంగా మ్యాజిక్. కాగా మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 134 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.