తెలంగాణ అసెంబ్లీ బీసీల కలగణన చేపట్టాలని తీర్మాణం చేసింది. తీర్మాణాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ ఏకగ్రీవంగా తీర్మాణాన్ని ఆమోదించింది. ప్రస్తుత అసెంబ్లీలో కొన్ని రోజుల కిందట జరిగిన సమావేశంలో బీసీ కులగణన గురించి చర్చ జరిగింది. సమాజంలో దాదాపు 50 శాతం ఉన్న బీసీలలో వెనుకబడి ఉన్నారని అసెంబ్లీ అభిప్రాయపడింది. బీసీలు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి మరింత న్యాయం జరగాలని సీఎం ఆకాంక్షించారు. జనాభా గణనలో కులగణన జరగాలని ఏకగ్రీవంగా తీర్మాణం జరగాలని సీఎం సభ్యుల్ని కోరారు. దీంట్లో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ బీసీ కులగణన తీర్మాణం ఏకగ్రీవంగా నెగ్గింది. వెనుకబడిన వర్గాల మరింత అభివ్రుద్ధి జరగాలంటే మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తీర్మాణంలో పేర్కొన్నారు. ఆర్టికల్ 15, 16,243 డీ ప్రకారం బీసీల గణన అవసరమని తెలిపారు. గతంలో కూడా బీసీల అభివ్రుద్ధి, కులగణనపై అసెంబ్లీలో చర్చ జరిగింది.
బీసీ కులగణన చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం
-