లో దుస్తులు ధరించేటప్పుడు ఈ తప్పులు చేస్తే ప్రైవేట్ పార్ట్స్ కి సమస్యలు తప్పవు…!

-

మనం వేసుకునే లో దుస్తుల పట్ల కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ కనుక కొన్ని తప్పులు చేస్తే ప్రైవేట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా మంది ఈ తప్పులు చేస్తూ వుంటారు. కానీ ఈ తప్పులు చేయడం వల్ల ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మహిళలు మరియు పురుషులు కూడా ఈ తప్పులు చేయడం వల్ల నెగటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి వీటిని ఒక సారి చూసి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.

మళ్లీ అదే అండర్ వేర్ ని వేసుకోవడం:

మీరు ఒకసారి వేసుకున్న దానిని మరొకసారి కూడా వేసుకున్నట్లయితే దాని వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

చెమటగా ఉండే దానిని వేసుకోవడం:

బాగా చెమట పట్టిన అండర్ వేర్ ని మరొకసారి వేసుకోవడం కూడా చాలా మంది చేసే తప్పు. ఇలా చేయడం వల్ల ఈస్ట్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా చేయడం వల్ల దురదలు మరియు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా చెమట పట్టిన వాటిని మరొకసారి వేసుకోకండి.

టైట్ గా వుండే అండర్ వేర్ ని వేసుకోవడం:

మీ సైజ్ కి తగ్గ అండర్ వేర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బాగా చిన్న సైజు వాటిని వేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి లేదు అంటే చర్మ సమస్యలు వస్తాయి.

ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ని వేసుకోవద్దు:

చాలా మంది ఎక్కువగా అందంగా ఉండే అండర్ వేర్స్ ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. సాటిన్, లేస్ మొదలైన వాటితో తయారుచేసిన వాటిని వేసుకోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా చర్మానికి మేలు చేసే మెటీరియల్ ని మీరు ఎంచుకోండి.

సెంటెడ్ డిటర్జంట్స్ తో ఉతకద్దు:

సెంటెడ్ డిటర్జెంట్ తో ఉతికి… వాటిని వేసుకోవడం వల్ల కెమికల్స్ చర్మానికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇలా వాటితో ఉతికి వేసుకోవడం వల్ల వజినల్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఇలాంటి తప్పులు చేయొద్దు. ఈ తప్పులు చేశారంటే ఇబ్బందులు తప్పవని గమనించండి.

Read more RELATED
Recommended to you

Latest news