నిరుద్యోగులకు శుభవార్త.. టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌ మెంట్ పై జగన్ కీలక ఆదేశాలు

-

యూనివర్శిటీల్లో టీచింగ్‌ స్టాఫ్‌ను రిక్రూట్‌ చేయమని ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ ఉన్నత విద్య పై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదని… టీచింగ్‌ స్టాఫ్‌లో క్వాలిటీ ఉండాలని పేర్కొన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలని… ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎన్ని సమస్యలున్నా ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో ఎక్కడా లోటు చేయడం లేదని… ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంవల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు.

ప్రతి వారం ఒక వీసీని పిలిపించుకుని యూనివర్శిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై చర్చించాలని ఉన్నత విద్యామండలికి ఆదేశించారు సీఎం జగన్. ఆ సమావేశంలో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించిన సీఎం జగన్…వచ్చే మూడు సంవత్సరాల కాలానికి కార్యాచరణ రూపొందించుకుని ఆ మేరకు యూనివర్సిటీలు పని చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news