ఆ.. వాకింగే కదా.. దాంతో ఏమవుతుందిలే.. అని చాలా మంది వాకింగ్ చేసేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. కానీ నిజానికి వాకింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వాటి గురించి మీరు తెలుసుకుంటే ఇకపై మీరు కూడా నిత్యం వాకింగ్ చేయాలని ఆసక్తి చూపుతారు. మరి వాకింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక సమస్యల నుంచి మనల్ని బయట పడేస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు తదితర మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఆయా సమస్యల నుంచి చాలా త్వరగా బయట పడవచ్చు. అలాగే వాకింగ్ చేయడం వల్ల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
2. నిత్యం వాకింగ్ చేస్తే కంటి చూపు మెరుగు పడుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
3. నిత్యం వాకింగ్ చేస్తే గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
4. వాకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
5. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే చాలు.. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో తెలిసింది. అలాగే వాకింగ్ చేయడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
6. నిత్యం 100 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు.
7. రోజూ వాకింగ్ చేయడం వల్ల కీళ్లు, కండరాలు బాగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడేవారు వాకింగ్ చేస్తే ఫలితం ఉంటుంది.