Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమ అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా ఎదిగాడు. అటు అర్జున్ రెడ్డితో మాస్ ఫాలోయింగ్, ఇటు గీత గోవిందం తో ఫ్యామిలీ ఆడియన్స్ తో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్ సమ్ గా ఉండే.. ఈ రౌడీ హీరో కూడా రీసెంట్ హార్ట్ బ్రేక్ అయిందట. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన “పుష్పక విమానం” సినిమాకు విజయ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో చిట్ చాట్ లో పాల్గొన్న దేవరకొండ బద్రర్స్.
ఇందులో భాగంగా.. విజయ్ దేవరకొండ డేటింగ్‌లో ఉన్నారా? సింగిలా? అంటూ ప్రశ్నించారు ఆనంద్. ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఈ మధ్యే నా హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే కొంచెం బాధలో ఉన్నా’ అని తెలిపాడు.
ఈ విషయం ఎవరికి తెలియదని చెప్పకోచ్చారు. దీంతో దేవరకొండతో బ్రేకప్ అయిన ఆ అమ్మాయి ఎవరా అనే ఆలోచనలో పడ్డారు రౌడీ ఫ్యాన్స్. ఇదే కొశ్చన్ కు ఆనంద్ దేవరకొండ సమాధానమిస్తూ.. తాను ఇంకా సింగిల్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఆ తరువాత.. ఫేవరేట్ హీరో ఎవరని ప్రశ్నించగా.. విజయ్ సమాధానమిస్తూ.. హాలీవుడ్ లో మెరీల్ స్ట్రీప్, డెంజెల్ వాషింగ్ టన్ ఇష్టమని, ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టామని, ఇక మన టాలీవుడ్ లో మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని వెల్లడించారు. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని విజయ్ దేవరకొండ బదులిచ్చారు.
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే లైగర్ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ అమెరికాకు వెళుతున్నారు. లైగర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరీ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.