తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశన్య రుతుపవనాల వల్ల తమిళనాడు తో పాటు కేరళ రాష్ట్రాలలో వర్షం పడుతున్న విషయం తెలిసిందే. అయితే కింది స్థాయి నుంచి తూర్పు దిశ గా తెలంగాణ వైపు కు గాలులు వీస్తున్నాయని తెలిపారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలిక పాటి వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే ఈ గాలులు కు తోడు గా బంగాళ ఖాతం లో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. ఈ నెల 15న ఈ అల్ప పీడనం ఉత్తర అండమాన్ సముద్రం తో పాటు దానిని అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతం లో వాయు గుండం గా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈ వాయుగుండం ద్వారానే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వార్త తెలంగాణ రైతంగానికి ఒక రకంగా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ లో వరి కొతలు ఉండటం వల్ల వరి ధాన్యం అంత బయటనే ఉంటుంది. దీంతో వర్షాలు పడితే ధాన్యం తడిచే అవకాశం ఉంటుంది.