బండి సంజయ్..ఢిల్లీలో ఏం పీకుతున్నావు… బొగ్గు మంత్రితో మాట్లాడు.. సింగరేణి సమస్యలు పట్టవా నీకు..? అని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉంటారని.. కేంద్రాన్ని కనీసం అడగరని ఫైర్ అయ్యారు. సింగరేణిపై బీజేపీ నేతలు అసలు మాట్లాడరని.. పట్టింపు లేదన్నారు. బట్టే బాజ్ బీజేపీ ఎంపిలు… బీజేపీ ఎంపీలకు ఒళ్ళు మందం అయ్యిందని నిప్పులు చెరిగారు.
సింగరేణి… కోల్ బెల్ట్ కి వస్తె తరిమి కొట్టండని.. సింగరేణి కార్మికులు దీక్ష చేస్తుంటే బీజేపీ ఎంపిలు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. తెలంగాణలో తిరిగే హక్కు బీజేపీ ఎంపీలకు లేదన్నారు. తెలంగాణకు మిషన్ భగీరథ కి నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసినా పైసా ఇవ్వలేదని… యూపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. నదుల అనుసందానం పేరుతో 36 వేల కోట్లు ఇచ్చారని కేంద్రం పై ఫైర్ అయ్యారు.
అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇస్తున్నారని… తెలంగాణకు ఐటీఐఆర్ రద్దు చేయకుండా ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టే పనిలో పడిందన్నారు. కేంద్రం తెలంగాణ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని.. మొన్నటి వరకు వరి ధాన్యం కొనుగోలు మీద మోసం చేసిందని వెల్లడించారు. ఇప్పుడుసింగరేణి పై కేంద్రం కన్ను పడిందని నిప్పులు చెరిగారు.