174 పరుగులకే కుప్ప కూలిన భారత్.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే

-

సెంచూరీయన్‌ వేదికగా.. జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌ లో… 174 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ అయింది. మొదటి ఇన్నింగ్స్‌ బాగా ఆడిన.. భారత ఆటగాళ్లు… రెండో ఇన్నింగ్స్‌ లో మాత్రం.. సౌతాఫ్రికా.. బౌలర్ల దాటికి పెవిలియన్‌ దారి పట్టారు. రెండో ఇన్నింగ్స్‌ లో 50 ఓవర్లు ఆడిన… ఇండియా… 174 పరుగులకు కుప్పకూలింది.

కేఎల్‌ రాహుల్‌ 23 పరుగులు, రహానే 20, పంత్‌ 34 పరుగులు, విరాట్‌ కోహ్లీ 18 పరుగులు చేసి.. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ ను అందించారు. దీంతో సెంచూరియన్‌ టెస్ట్‌ లో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే.. 305 పరుగులు కావాల్సి ఉంటుంది.

ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌ లో 327 పరుగులు చేసింది టీమిండియా. ఆ మ్యాచ్‌ లో కేఎల్‌ రాహుల్‌ సెంచరీ చేసి.. అదరగొట్టాడు. అలాగే.. మొదటి ఇన్నింగ్స్‌ లో సౌతాఫ్రికా జట్టు 197 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news