ఆశా వర్కర్లకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. నెలసరి ప్రోత్సాహకాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఇన్సెంటివ్ లను 30 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు ఎం హెచ్ ఎం కింద పని చేస్తున్న ఆశ వర్కర్లకు జీతాలు పెంపు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది కేసీఆర్ సర్కార్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నెలసరి ప్రోత్సాహకాలు 7500 నుంచి రూ. 9750 కి పెరగనున్నాయి. ఇక ఈ ఏడాది జూన్ మాసం నుంచి ఈ పెంచిన ఇన్సెంటివులు వర్తిస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై తెలంగాణ రాష్ట్రంలోని.. ఆశా వర్కర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కేసీఆర్ సర్కార్ తమ డిమాండ్ పై స్పందించినందున.. తాము ఇక ముందు చాలా సమర్థవంతంగా పని చేస్తామని ఆశా వర్కర్లు చెబుతున్నారు.