బిహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. బిహార్ నలందలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 11 కు చేరింది. అయితే.. మృతి చెందిన వారంతా సోహ్ సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటీ పహాడీ, పహర్ తల్లి గ్రామాలకు చెందివారేనని అధికారులు ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోహ్ సరాయ్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సురేష్ ప్రసాద్ ను అధికారులు సస్పెండ్ చేశారు.
నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభంకర్, ఎస్పీ అశోక్ మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల బంధువులను ఆరా తీశారు పోలీసులు. ఇక ఈ సంఘటన ను తీవ్రంగా పరిగణించినట్లు శశాంక్ శుభంకర్ పేర్కొన్నారు. చిన్న కొండ ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా విభజించి మద్యం మాఫియా పై కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటన చేశారు. ఈ సంఘటన వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు శశాంక్ శుభంకర్.