వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో ఈ నెల 31 వరకు కరోనా ఆంక్షలు..

-

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలను పొడగిస్తున్నట్లు వెల్లడించారు డీహెచ్ శ్రీనివాస రావు. ఈనెల 31 వరకు జనాలు గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు డీహెచ్ వెల్లడించారు. తెలంగాణలో వారం రోజులుగా లక్షకు పైగా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇంటింటి ఫివర్ సర్వే జరుగుతుందని ఆయన వెల్లడించారు. మూడు రోజుల్లో 1.78 లక్షల మందికి జ్వర బాధితులకు మెడివల్ కిట్లు అందించామని తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలకు 59 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈరోజు హైకోర్ట్ లో కరోనాపై విచారణ జరిగింది. నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు అక్కర లేదని వైద్యారోగ్య శాఖ హైకోర్ట్ కు నివేదిక అందించింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువగానే ఉందని వెల్లడించింది. పాజిటివిటీ రేటు తెలంగాణలో 10 శాతం కన్నా తక్కువగానే ఉందన్నారు. 10 శాతం దాటితేనే నైట్ కర్ప్యూ అవసరం అవుతుందని హైకోర్ట్ కు ప్రభుత్వం నివేదించింది.

Read more RELATED
Recommended to you

Latest news