నల్లగొండ జిల్లా ఆర్య వైశ్య సంఘం ప్రథమ అధ్యక్షుడు, మున్సిపల్ తొలి చైర్మన్ తాళ్లపల్లి వెంకటనారాయణ మరణించారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టణంలో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.