భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ.. ఇతరులను ఓర్వ లేకుండా… దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పార్టీ మనకు అవసరమా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీని… కూకటివేళ్లతో పెకలించి… బంగాళాఖాతంలో పారేస్తామని సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బిజెపి పార్టీకి సిగ్గు శరం లేదని మండిపడ్డారు.
కరోనా సమయంలో హెల్త్ బడ్జెట్ పెంచలేదని.. ఇంతకంటే ఘోరం మరోటి ఉండదని ఫైర్ అయ్యారు సీఎం కెసిఆర్. బడ్జెట్ గోల్ మాల్ గోవిందమనీ.. బీజేపీ పాలన అంటే నమ్మి ఓటేస్తే అమ్మేయడం అంటూ అగ్రహించారు. మత పిచ్చి లేపి జనాన్ని రెచ్చగొట్టడం బీజేపీ పాలన అని ఫైర్ అయ్యారు. ఆహార సబ్సిడీ కూడా తగ్గించారని.. MSP ప్రస్తావన లేదని మండిపడ్డారు. ఎయిర్ ఇండియా అమ్మేశారు..LIC నీ అమ్ముతామని బడ్జెట్లో నిస్సిగ్గుగా చెప్పారని.. లాభాల్లో ఉన్న LICనీ ఎందుకు అమ్ముతారు ? అని నిలదీశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని … పెట్టుబడి రెట్టింపు చేశారని అగ్రహించారు సీఎం కెసిఆర్.