కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదు… నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్: రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదని.. నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు టీపీపీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. 2004లో కేసీఆర్ ని నమ్మి మోసం చేశారని.. 2014లో మాటిచ్చి మోసం చేశారని.. మూడోసారి మరోసారి మోసపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరని అన్నారు. కేసీఆర్ ని బొందిలో ప్రాణంగా ఉండగా నమ్మమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాజకీయ అవకాశవాది అని విమర్శించారు. రాహుల్ గాంధీపై హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను ఖండిస్తే.. ఇక్కడ కరిగే వారు లేరని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో పంపకాల్లో సమస్యలతోనే గొడవలు పడుతున్నాయని ఆరోపించారు. తోడు దొంగల్లా వ్యవహరిస్తూ… ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరం అని ఆయన అన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ఆయనను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎంపై ఫిర్యాదు చేస్తాం అని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news