మొహాలీ వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లో ఇండియా భారీ స్కోరు చేసింది. ఇవాళ రెండో రోజు సెకండ్ షేషన్ లో టీమిండియా 578 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే టీమ్ ఇండియా ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా అత్యధికంగా 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే.. డబుల్ సెంచరీ మిస్..చేసుకున్న జడేజా.. పలు రికార్డులు నమోదు చేసుకున్నాడు.
7వ ప్లేస్ లో వచ్చి 100 పార్ట్నర్షిప్ నమోదు చేసిన తొలి బ్యాటర్ గా జడేజా నమోదు చేసుకోగా..పాకిస్తాన్ గడ్డపై 2004లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఇలాంటి దే జరిగింది. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలతో కలిసి ఆరు, ఏడో, 9వ వికెట్లకు 100 రన్స్ కి పైగా పార్ట్నర్షిప్ నెలకొల్పిన బ్యాటర్ గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు.
ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా జడేజా రికార్డులలోకి ఎక్కాడు. ఇంతకు ముందు వినోద్ కాంబ్లీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్ పేరిట ఈ ఫీట్ ముందు ఉండేది. బ్యాటింగ్ ఆర్డర్లో 7వ ప్లేస్ లో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక స్కోరు నమోదు చేసాడు భారత బ్యాటర్‌గా రవీంద్ర జడేజా. ఇంతకుముందు 1986లో శ్రీలంకపై కపిల్‌దేవ్ 163 పరుగులు చేయగా… జడ్డూ ఆ రికార్డును అధిగమించాడు. కపిల్ దేవ్ తర్వాత 5 వేల రన్స్.. 400+ వికెట్లు పడగొట్టిన భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జడేజా.